Writer and director Kanagala Jayakumar : సిల్క్ స్మిత.. మత్తు కళ్ళతో కుర్రకారుని పడేసిన ఒకప్పటి శృంగార దేవత. సిల్క్ ఒక్కసారి సినిమాలో కనిపిస్తే ఆ సినిమా హిట్ అనేంతలా క్రేజ్ సంపాదించుకున్న ఈ డస్కీ బ్యూటి కుర్రాళ్ళకు శృంగార తారగా మారింది. 400 పైగా సినిమాల్లో నటించిన సిల్క్ అంతే త్వరగా తన జీవితాన్ని ముగించుకుంది. వాంప్ పాత్రలకు బాగా ఫేమస్ అయిపోయి ఒకానొక దశలో సిల్క్ తో ఐటమ్ సాంగ్ ఉంటేనే సినిమా హిట్ అనే దశకు చేరుకుంది. అలా దాదాపు రెండువందలకు పైగా నటించిన సిల్క్ క్రేజ్ ఎంతగా ఉండేదంటే హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్న ఏకైక నటి అప్పట్లో, అలాగే ఆమె కొరికిన ఆపిల్ వేలం వేస్తే ఇరవై ఐదువేలు పలకడం అప్పట్లో సంచలనం. అంత క్రేజ్ సంపాదించుకున్న సిల్క్ నా అనేవాళ్ళు లేకపోవడం వల్ల ఒక వ్యక్తిని బాగా నమ్మి మోసపోయిందని వార్తలు వినిపించాయి. ఇక ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలను రైటర్ మరియు డైరెక్టర్ అయిన కనగాల జయకుమార్ గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

సిల్క్ ను కొట్టిన చిరు…
రక్తబంధం అనే సినిమాలో చిరంజీవి తో పాటు సిల్క్ స్మిత ఒక పాత్రకు నటించాల్సి ఉండగా ఆమె డైలాగులు సరిగా చెప్పలేక పోవడం చూసి అస్సోసియేట్ డైరెక్టర్ గా ఉన్న కనగాల జయకుమార్ గారు డైరెక్టర్ కు ఆమెను తీసేసి వేరే వాళ్ళను పెట్టుకోవాల్సిందిగా సలహా ఇచ్చారట. అయితే మళ్ళీ కొన్నేళ్లకు ఆమె సూపర్ స్టార్ అయ్యాక ఆమె చిరంజీవి తో ఒక సినిమాలో నటించే సమయంలో అక్కడ పనిచేస్తున్న జయకుమార్ గారిని పిలిచి మిమ్మల్ని ఎక్కడో చూసాను అంటూ అదే పనిగా ఏడిపించాలని చూశారట.

అది చూసిన చిరంజీవి గారు అలాగే నిర్మాత క్రాంతికుమార్ గారు విషయం జయకుమార్ గారిని అడిగి తెలుసుకున్నారట. ఇక ఆమె కావాలనే ఆలా చేసిందని తెలిసి చిరు, సిల్క్ స్మిత కాంబినేషన్ లో ఉన్న సీన్ లో ఆమెను కొట్టే సన్నివేశం ఉండగా ప్రాక్టీస్ అపుడు ఊరికే కొట్టినట్లు చేసిన చిరు సీన్ చేసేటపుడు క్రాంతి కుమార్ గారు సైగ చేయగా నిజంగానే కొట్టారట. ఆలా చిరు ఎంత గట్టిగా కొట్టారో తెలియదు కానీ ఆమె చాలా డ్రామా చేసింది అంటూ జయకుమార్ తెలిపారు. ఇక ఆమె ఎంత క్రేజ్ సంపాదించుకున్నా నా అనేవాళ్ళు లేకపోవడం వల్ల రాధాకృష్ణ అని ఒక డాక్టర్ ను నమ్మి బాగా మోసపోయింది అంటూ చెప్పారు జయకుమార్. ఆస్తులన్నీ అతను కాజేశాడు అంటూ చెప్పారు.