Writer and director Kanagala Jayakumar : జయసుధ.. 1972లో పండంటి కాపురం సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యి సహజ నటిగా అభిమానులలో పేరు సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో నటించి దాదాపు 300 సినిమాలు చేసారు. జయసుధ నటించిన 25 సినిమాలు ఒకే సంవత్సరంలో విడుదల అవ్వడం విశేషం. నటిగా తన ప్రస్థానం మొదలు పెట్టి 50 వసంతాలు పూర్తి చేసుకుని అరుదైన ఘనత సాధించిన ఆమె ప్రస్తుత రాజకీయాల వైపు చూస్తున్నారు. ఇదివరకు సికింద్రాబాద్ ఎమ్మెల్యే గా పనిచేసిన జయసుధ తాజాగా బీజేపీ లో చేరారు. ఇక ఆమె కెరీర్ రాజకీయ జీవితం గురించి రైటర్ మరియు డైరెక్టర్ అయిన కనగల జయకుమార్ మాట్లాడారు.

రాజకీయాల కోసం సినిమాలకు దూరం…
జయసుధ గారు నటిగా ఎన్నో ఏళ్ల సుధీర్ఘ కెరీర్ గల నటిగా గుర్తింపు పొందారు. ఆమె హీరోయిన్ గా, చెల్లిగా, అక్కగా, అమ్మగా ఇపుడు బామ్మగా కూడా నటిస్తుండటం విశేషం. అయితే తాజాగా ఆమె సినిమాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు కనగల జయకుమార్ తెలిపారు. ఆమె రాజకీయాలలో చురుగా ఉండాలని భావిస్తున్నారట అందుకే సినిమాలకు దూరంగా ఉండబోతున్నారంటూ జయకుమార్ తెలిపారు.

ఇక జయసుధ తన నట ప్రస్థానంను బయోపిక్ గా నిర్మించాలని భావిస్తున్నట్లు జయకుమార్ తెలిపారు. హాలీవుడ్ లో నటించి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఫిలిప్ అనే నటుడు జీసస్ ను నమ్మి సినిమాలను వదిలేసారు. ఇక జయసుధ గారు జీసస్ ను నమ్ముతారు. అందుకే ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. ఇపుడు ఆయన సహకారంతో బేబీ సినిమా హీరోయిన్ ని పెట్టి జయసుధ బయోపిక్ తీయాలని భావిస్తున్నారట.