Writer Kanagala Jayakumar : అలనాటి తార సావిత్రి హీరోలకు ధీటుగా స్టార్ డమ్ ని సంపాదించుకున్న హీరోయిన్. హీరోలకు సమానంగా అభిమానులను సంపాదించుకున్న మహానటి కొంతమంది హీరోలను స్క్రీన్ మీద తన నటనతో డామినేట్ చేసేది. అందం, అభినయం, వ్యక్తిత్వం అన్నీ కలగలసిన ఏకైక హీరోయిన్ గా సౌత్ సినిమా ఇండస్ట్రీలో చిరస్తాయిగా మిగిలిన తార. పేదరికం నుండి వచ్చిన సావిత్రి గారు ఆ తరువాత సినిమాల్లో నటన ద్వారా కొన్ని వేల కోట్ల ఆస్తులను సంపాదించారు. కానీ చివరి దశలో అదే పేదరికంలో మరణించారు. కానీ ఆమె గొప్పతనం ఇప్పటికీ ఎంతో మంది సినిమా తారలు గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఆమె తప్ప ఇంకెవరూ మహనటి కాలేరు అంటూ చెబుతారు. ఇక ఆమె గురించి విలక్షణ నటుడు ఎస్వి రంగారావు గారు ఏమన్నారో రైటర్ కనగాల జయకుమార్ ఆయన జ్ఞాపకాలను పంచుకున్నారు.

సావిత్రి మహనటి అని చెప్పింది ఆయనే…
ఎస్వి రంగారావు గారు విలక్షణ నటులు, ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోగల ఆయన సావిత్రి గారి నటన గురించి గొప్పగా మాటాడుతుంటే ఆశ్చర్యపోయానంటూ చెప్పారు జయకుమార్. ఒక సినిమా షూటింగ్ సమయంలో ఖాళీగా కూర్చున్నపుడు మాటల సందర్భంలో సావిత్రిగారి ప్రస్తావన రాగా ఆయన రెండు చేతులు పైకిత్తి దండం పెట్టి సావిత్రి గారి నటనను పొగిడారు. ఆమె మహానటి అంటూ ప్రశంశించారు. అప్పటి వరకు ఆమె అభినయం గమనించని నేను ఆయన చెప్పిన తరువాత సినిమాల్లో ఆమె అభినయం గమనించాను.

ఆమె కళ్ళతోనే పలికే హావభావాలు గమనించినపుడు నిజంగానే ఎస్విఆర్ గారు చెప్పినట్లు ఆమె మహానటి అనిపించింది. ఒకవైపు మాయాబజర్ లో శశిరేఖ, మరోవైవు దేవదాస్ లో పార్వతి ఇలా ఎక్కడ సావిత్రి నటన నచ్చింది అంటే చెప్పలేము అంటూ అలా చాలా సినిమాలు ఉన్నాయ్, ఆమె మహానటి అందుకే అయింది. ఆమె స్థానం ఇంకెవరూ అందుకోలేరు అంటూ జయకుమార్ తెలిపారు.



























