Yandamuri Veerendranath: యండమూరి వీరేంద్రనాథ్ ప్రసిద్ధ నవలా రచయిత. అలాగే వ్యక్తిత్వ వికాసం పై సభలు నిర్వహిస్తుంటారు. ఇప్పటి యువతరం ఎలా ఉన్నారు వాడి మనోభావాలు ఎలా ఉంటున్నాయి ఆత్మహత్య భావనలు ఎందుకు పెరుగుతున్నాయి వంటి వాటిపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు.

విడాకుల గురించి అమ్మాయిల గురించి…
ఇక ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకుంటున్న జంటలు మన సమాజం లో కూడా ఎక్కువవుతున్నారు. ఇక ఈ విషయం గురించి యండమూరి తనదైన శైలిలో మాట్లాడారు. సెలబ్రిటీల విడాకుల ఘటనల గురించి మాట్లాడారు. ఇక తన వారసుడిని ఇండస్ట్రీలోకి పరిచయం చేయడం ఇష్టం లేదని తెలిపాడు. ఇక అమ్మాయిల విషయానికోస్తే అమ్మాయిలకు వ్యసనాలు అలవాటు ఉన్నా పెళ్ళయ్యాక మానుకోవడం మంచిదని, ఇక అబ్బాయిల కన్నా అమ్మాయిలు శారీరకంగా దృడంగా ఉండరు కాబట్టి సిగరెట్లు తాగడం వంటివి మానుకోవడం మంచిదని చెప్పారు. చేదు అలవాట్లకు పోతే అమ్మాయిలు చదువులో వెనుక బడుతారంటు చెప్పారు. ఈ మధ్య అమ్మాయిలు డబ్బులు ఇవ్వకపోతే కొడుతున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయని చెప్పారు.
చిరంజీవి నావాడు….

ఇక చిరంజీవి గురించి మాట్లాడుతూ చిరంజీవి నావాడు అంటూ మాట్లాడారు. రాక్షసుడు లాంటి నవలలు బాగా నచ్చుతాయని, ఇంగ్లీషు నవలల ఆధారంగా ఛాలెంజ్ కథ పుట్టిందని, వెన్నెల్లో ఆడపిల్ల నవల తొలుత ఏడు వారాలు అనుకున్న ఆ తరువాత పన్నెండు వారాల నవలగా మార్చనని నేను నవలలు రాసే సమయానికి మహిళా రచయితలు తగ్గారని చెప్పారు.






























