Sri Reddy: సినిమా టికెట్ రేట్ల విషయం టాలీవుడ్, ఏపీ ప్రభుత్వం మధ్య కాక రేపుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల ఈ విషయంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే.. సినీ హీరో నాని, సిద్దార్థ్ వంటి వారు ఈవిషయంపై స్పందించారు.

హీరో నాని ఏకంగా.. సినిమా థియేటర్ల కలెక్షన్లు, కిరాణా కొట్టు కలెక్షన్ల కన్నా తక్కువగా ఉంటున్నాయని.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనికి ఏపీ మంత్రి పేర్ని నాని కూడా అంతే రీతిలో స్పందించాడు. ఇదిలా ఉంటే తాజాగా వివాదాస్పద, సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రభుత్వం, టికెట్ రేట్లపై ట్విట్లతో అగ్నికి ఆజ్యం పోశాడు.

వరసగా ట్విట్లు చేస్తూ కాక రేపాడు. దీనికి సమాధానంగా మంత్రి పేర్ని నాని కూడా ట్విట్లు చేశారు. ఆర్జీవీ ట్విట్ ను రీట్విట్ చేశాడు నాగబాబు. ఇదిలా ఉంటే ఆర్జీవీ మనం కలిసి డిస్కస్ చేద్దాం అని మంత్రితో అనడంతో అక్కడితో వివాదం ముగిసింది. తాజాగా ఈ వివాదంలోకి వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఎంటర్ అయింది.
పనిపాట లేని వ్యక్తి ఆర్జీవీ అంటూ విరుచుకుపడింది..
దీంతో మరోసారి ఇది రచ్చకు దారితీసేలా కనిపిస్తోంది. ఆర్జీవీపై విరుచుకుపడింది శ్రీరెడ్డి. పనిపాట లేని వ్యక్తి ఆర్జీవీ అంటూ విరుచుకుపడింది. పైకి ఏం పట్టించుకోనట్లు కనిపించినా… తన గురించి మాట్లాడిన వ్యక్తిపై పగ తీర్చుకునే టైపు ఆర్జీవీ అంటూ ఫైర్ అయింది. ఏ రోజైనా తన గురించి వార్త రానప్పుడు.. ఏదో ఒక సంచలన క్రియేట్ చేస్తుంటాడని విమర్శించింది. నీకు అంతకుముందు నేను దొరికాను, సురేష్ బాబు పంచన చేరావు. ఈరోజు నీకు థియేటర్ల ప్రాబ్లమ్స్ కావాల్సి వచ్చాయా అని సూటిగా ప్రశ్నించింది. ఎందులో అయిన దూరిపోయి సర్వనాశనం చేసే వ్యక్తి ఆర్జీవీ అని అంది. బాలీవుడ్ ‘ ఛీ తూ..’ అంటే తట్టాబుట్టా సర్దుకుని.. హైదరాబాద్ వచ్చేశావు. బ్లూ ఫిలిమ్స్ తీయడం, బీగ్రేడ్, సీగ్రేడ్ తీయడం, అమ్మాయిలను కూర్చోబెట్టుకుని వాళ్ల తొడల గురించి మాట్లాడటం ఆయన తీరని విమర్శించింది. నువ్వు ఏమైనా చేసుకో.. జగన్ ప్రభుత్వ జోలికి రాకు.. జగన్ గారి జోలికా రావాలంటే ముందుగా నన్ను దాటుకుని వెళ్లాలని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది శ్రీరెడ్డి. ప్రస్తుతం ఆర్.జి.వి గురించి శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.





























