కుక్క పిల్లను కొనలేదన్న కారణంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు ఒక యువకుడు. ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నంలో జరిగింది ఈ ఈ విషాద ఘటన. వివరాల్లోకి వెళితే.. విశాఖకి చెందిన షణ్ముక వంశీ (16) ఇటీవల ఆన్లైన్ లో రూ. 30 వేల విలువైన ఓ కుక్క పిల్లను చూసాడు.

చూసిన వెంటనే అతనికి నచ్చడంతో తనకు కొనివ్వాలని తల్లిని కోరాడు. అయితే ఇప్పుడు కాదు కొద్దిరోజుల తరువాత కొనిస్తానని ఆ తల్లి చెప్పడంతో మనస్తాపానికి గురైన షణ్ముక వంశీ మంగళవారం తల్లి ఇంట్లో లేని సమయంలో గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.



























