Youtuber Ammamaata Jaya : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా జమానాలో కామన్ మాన్ కూడా సెలబ్రిటీ అయిపోవచ్చు. యూట్యూబ్ ద్వారా ఎంతో మంది రోజూ ఫేమస్ అవుతున్నారు. ఒకవైపు డబ్బు సంపాదిస్తూనే మరోవైపు పేరు సంపాదిస్తూ ఫాలోయర్స్ ని పెంచుకుంటున్నారు. అలా యూట్యూబ్ ద్వారా అందరికీ చేరువైన వ్యక్తి అమ్మమాట జయ గారు. యూట్యూబ్ లో అమ్మమాట అనే ఛానెల్ ద్వారా సలహాలు అందిస్తూ మరో వైపు పూజలు వంటివాటిని చూపిస్తూ ఎంతోమంది తెలుగు వాళ్లకు చేరువయ్యారు. ముఖ్యంగా ఆమె చెప్పే విలువైన మాటల్లో బంగారం కొనుగోలు చేయడం చాలా మంది మహిళలకు నచ్చిన అంశం. తాజాగా ఆమెను యూట్యూబ్ ఛానెల్ అయిన సుమన్ టీవీ వారు ఇంటర్వ్యూ చేసారు.

యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయడానికి కారణం…
జయ గారి సొంతూరు భీమవరం. ఇది ఆమె యూట్యూబ్ ఛానెల్ ఫాలో అయ్యే ఎవరికైనా ఇట్టే తెలుస్తుంది. అక్కడి సంప్రదాయాలను అలాగే పండుగలను చూపిస్తూ ఆమె వీడియోలను కూడా చేస్తుంటారు. ఇక జయ గారు భీమవరంలో దాదాపుగా 20 ఏళ్ళు లోకల్ ఛానెల్ లో న్యూస్ రీడర్ గా పనిచేసారు. అదే కాకుండా పాత సినిమాల గురించి స్పెషల్ ప్రోగ్రామ్ కూడా చేసేవారు. అలా న్యూస్ ఛానెల్ లో పనిచేయడానికి కారణం కూడా ఆమె భర్త తమ్ముడేనట. ఆయన మొదట మీరు న్యూస్ రీడర్ గా చేయొచ్చు కదా అని సలహా ఇవ్వడం, జయ గారి భర్త కూడా ఒప్పుకోవడంతో చేశారట.

ఇక ఇప్పుడు యూట్యూబ్ లో కూడా ఛానెల్ పెట్టమని తన మరిది సలహా ఇచ్చారని జయ తెలిపారు. ఒక్కదాన్నే చేసుకోలేనని చెప్పడంతో కూతురు సంధ్య తాను కలిసి యూట్యూబ్ ఛానెల్ పెట్టాలని అనుకున్నారట. అలా 2021 దసరా నాడు మొదలు పెట్టిన ఛానెల్ లో ఇప్పటి వరకు ప్రతిరోజు వీడియోస్ పెట్టనట్టు జయ తెలిపారు. తానే ఎడిటింగ్ చేసుకుని పెడతానంటూ చెప్తారు. తాను పాటించే చిన్న చిన్న చిట్కాలనే అందరికీ చెప్తానని జయ చెప్పారు. ఇక మొదటి యూట్యూబ్ ఛానెల్ సంపాదన 10 వేలు కాగా ఇప్పుడు భాగానే వస్తుందని, లక్షల్లో సబ్స్క్రయిబర్లు ఉండటం వల్ల సంపాదన అలాగే మంచి గుర్తింపు రెండూ వస్తున్నాయంటూ తెలిపారు.



























