Youtuber Harsha Sai : సోషల్ మీడియా బాగా వాడుకలోకి వచ్చాక సామాన్యులు కుడా సెలబ్రిటీలైపోయారు. యూట్యూబ్ మద్యమం ద్వారా వీడియోలు చేస్తూ ఎంతో మంది సామాన్యులు ఫేమస్ అవుతున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ తో అటు డబ్బులనే కాకుండా ఇటు అభిమానులను సొంతం చేసుకుని సినిమా సెలబ్రిటీలకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు. ఇక అలా యూట్యూబ్ ఛానెల్ ద్వారా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇవ్వడమే కాకుండా అటు సామాజిక సేవ చేస్తూ మనతో ఎంత డబ్బు ఉందనేది కాదు ఎంత సహాయం చేయగలమని నిరూపించి చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న వ్యక్తి యూట్యూబర్ హర్ష సాయి.

హర్ష సాయి ఎందుకు వీడియోలు చేయడం లేదు…
యూట్యూబ్ లో 2018 లో సొంత ఛానెల్ ప్రారంభించిన హర్ష సాయి అందులో వినూత్న వీడియోలు పెట్టి ఫాలోయింగ్ పెంచుకున్నాడు. అలా మొదలయిన ప్రస్థానం మరో లెవెల్ కి చేరి రోడ్డు పక్కన ఉండే పేదలకు సహాయం చేయడం, పేదవాళ్ళను ఫైవ్ స్టార్ హోటెల్ కి తీసుకెళ్లడం, ఉచితంగా పెట్రోల్ వంటి ఎన్నో కార్యక్రమాలను చేసి మరింత అభిమానులను సొంతం చేసుకున్న హర్ష సాయి గత ఐదు నెలలుగా యూట్యూబ్ లో కొత్త వీడియో అప్ లోడ్ చేయలేదు. చాలా రోజులైనా ఇంకా వీడియో పెట్టకపోవడంతో హర్ష సాయి ఏమయ్యాడు అనే ఆలోచన ఆయన ఫాలోయర్స్ కి కలుగుతోంది.

అతను చేస్తున్న సామాజిక సేవ అంతా ట్రాష్ అంటూ అనేవాళ్ళు కొంతమంది ఉన్నా ఎంతో మందికి తన దగ్గర ఉన్న డబ్బులతో మంచి జీవితాన్ని ఇస్తున్న హర్ష సాయి కి అభిమానులు అంతకంటే రెట్టింపులో ఉన్నారు. ఇక ఆయన వీడియోలు ఐదునెలలైనా రాకపోడానికి ఒక వీడియో కోసం చాలా కష్టపడుతున్నాడట హర్ష. ఆ వీడియో ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని, ఆ వీడియో కోసమే మరే వీడియో తన ఛానెల్ లో అప్లోడ్ చేయకుండా ఉన్నాడంటూ తెలుస్తోంది.



























