Youtuber Lally : రాకేష్ మాస్టర్ కి అది మూడో భార్య కాదు… పెద్ద దొంగ…: యూట్యూబర్ లల్లి

0
341

Youtuber Lally : రాకేష్ మాస్టర్ మూడో భార్యగా అందరికీ యూట్యూబ్ ద్వారా పరిచయమైన లక్ష్మీ అనే మహిళను తాజాగా కొంతమంది మహిళలు రోడ్డు మీదే చితక బాదారు. అయితే ఆమెను కొట్టింది నేనే అంటూ లల్లి అనే యూట్యూబర్ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. తనని కొట్టింది నేను మాత్రమే అంటూ తనని కొట్టడంలో తప్పు లేదంటూ లల్లి పేర్కొన్నారు. గత కొన్నిరోజులుగా బాగా వైరల్ అవుతున్న ఈ ఇష్యూలో లల్లి తన వెర్షన్ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఆ లక్ష్మి రాకేష్ మాస్టర్ కి భార్యే కాదు…

యూట్యూబర్ లల్లి లక్ష్మమ్మ ను బాగా కొట్టింది. ఈ విషయం వైరల్ అయ్యాక తానుసలు ఎందుకు కొట్టిందో యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. తాను తన కూతురిని ఎలాంటి మాటలు అనిందో కూడా చెప్పింది. అంతకు ముందు రాకేష్ మాస్టర్ కూతురుని కూడా ఇలాగే తిట్టిందని అందుకే మాస్టర్ వెళ్లగొట్టాడంటూ చెప్పింది లల్లి. ఆమె రాకేష్ మాస్టర్ కి మూడో భార్య కాదని చెప్పింది. మాస్టర్ దగ్గరికి పనిమనిషిలాగా వచ్చి ఆయనను బుట్టలో వేసుకుంది.

ఆయన తాగిన మైకంలో ఉన్నపుడు తాళి కట్టించుకుంది. ఆయన రెండు ముడులు వేసి మూడో ముడి వేయలేదు. పొద్దునే వేస్తా అన్నాడంట, ఆ విషయాలు కూడా యూట్యూబ్ వీడియోలో చెప్పుకుంది. ఆయనను ఏమార్చి ఇదంతా చేసింది. ఆయననే ఆయన ఇంట్లోనుండి వెళ్లగొట్టింది. ఎవరినీ వదలదు, ఆమెకు సహాయం చేసినవాళ్ళను కూడా నోటి కోచ్చినట్లు మాట్లాడుతుంది అంటూ లల్లి ఫైర్ అయింది.