సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. సంక్రాతి కానుకగా వచ్చి, రిలీజ్ అయిన తొలిరోజునుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది, అంతేకాదు పండగ అయిపోయాక కూడా భారీ కలెక్షన్ల దిశగా దూసుకెళ్తుంది. అయితే ఈ రిపబ్లిక్ డే సందర్భంగా అభిమానులకు మహేష్ బాబు కానుక ఇవ్వనున్నారు.. అదేనండి ఈ సినిమాలో మరికొన్ని కామెడీ సీన్స్ జోడించి అభిమానులకు, ప్రేక్షకులకు కానుక ఇవ్వనున్నారు. కొత్తగా యాడ్ చేసిన సీన్స్ తో ఈ శనివారం థియేటర్స్ లో ప్రదశించబోతున్నారు.
అనిల్ రావిపూడి మార్క్ డైలాగ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు కామెడీ టైమింగ్ కి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. కొత్త స్పీన్స్ ఎలా ఈ రేంజ్ లో ప్రేక్షకులను ఊపేస్తాయో శనివారం వరకు వేచిచూడాల్సిందే..



































