13 వ శతాబ్దానికి చెందిన బద్దెన అన్ తెలుగు కవి నీతిసారము అన్ ఒక నీతి కావ్యాన్ని రచించాడు.ఆ కవి అసలు పేరు భద్ర భూపాలుడు ఈయన ఆదర్శ స్త్రీ గురించి అలాగే ఆదర్శ పురుషుడి గురించి కావ్యాలను రాశాడు అలాగే ఒక మంచి భార్యకు అలాగే భర్తకు ఉండవలసిన లక్షణాలను గురించి చెప్పాడు.అయితే అందులో ఒక మంచి భర్త గురించి ఈయన చెప్పిన కొన్ని మాటల్ని గురించి తెలుసుకుందాం… భోగేశు రాజా వచనేశు రామ చతురశ్వ కృష్ణ దైర్యేశు కర్ణ రూపేశ ఇంద్ర కామేశు మధన అనగా దీని అర్దం ఏమిటంటే ఆదర్శ భర్త మహారాజులాగా సంపన్నుడై ఉండాలి .రాముడిలా నిజాయితీ పరుడై ఉండాలి కృష్ణుడిలా సమయస్ఫూర్తితో ఉండాలి కర్నుడిలాగ ధైర్యశాలి అయి ఉండాలి ఇంద్రుడి లాగా అందంగా ఉండాలి మదనుడిలాగా అనగా మన్మదుడిలా శృంగార శాస్త్రంలో ప్రవీనుడై ఉండాలి.సుమారు 700 సంవత్సరాల క్రితం బద్దెన రాసిన ఈ శతకం ఇంతకాలం కోట్లాది మంది తెలుగువారిలో నిలిచి ఉండడం దీని ప్రత్యేకతను తెలియజేస్తుంది.ఈ శతకం లోని పద్యాలు ఎంత సులభంగా ఉన్నపటికీ వాటి భావాలు అంతా గంభీరంగా సారవంతమైనవిగా ఉంటాయి.































