ఇప్పుడు ఏదైనా కొద్ది కాలమే.. తర్వాత ఏదైనా రొటీనై బోర్ కొడుతుంది. మళ్లీ కొత్తదేదో వింతగా వచ్చి పాతదాన్ని రిప్లేస్ చేస్తుంటుంది. అలాగే ఆయిల్‌తో చేసే మసాజ్ ఇప్పుడు మొహం మొత్తింది. ప్రస్తుతం కొరుకుడు మసాజ్ హల్చల్ చేస్తోంది. మసాజ్‌లో శరీరాన్ని ఆయిల్ మర్దనా చేస్తే.. ఇక్కడ మాత్రం శరీరాన్ని పండ్లతో కొరుకుతూ మసాజ్ చేస్తారు. నొప్పి లేకుండా కొరుకుతూ చేసే ఈ మసాజ్‌కు, అమెరికాలో ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. న్యూజెర్సీకి చెందిన డాక్టర్ డోరోతి స్టెయిన్ 1990లోనే శరీరాన్ని పళ్ళతో కొరుకుతూ చేసే ఈ మసాజ్ కనిపెట్టింది. రోజూ ఈ తరహా మసాజ్ చేసి అనారోగ్యంతో ఉన్న తన తల్లిని బాగు చేసింది. మంచి ఫలితాలు రావడంతో తర్వాత ఇదే తన వృత్తిగా ఎంచుకుంది.

మొదటగా రాక్ బ్యాండ్ కళాకారులకు ఈ కొరుకుడు మసాజ్ రుచి చూపించింది. ఆ నోటా ఈ నోటా పాకిపోయి ఆమె మసాజ్ కి మంచి పాపులరిటీ సంపాదించింది. అనేక మంది సెలబ్రిటీలు ఇప్పుడు ఆమె కస్టమర్లు. ఇప్పుడు ఆమెతో పోటీలు పడి కొరుకుడు మసాజ్ చేయించుకుంటున్నారు. స్థానికంగా డాక్టర్ డాట్అనే బిరుదు కూడా ఇచ్చారు. ప్రస్తుతం డాక్టర్ స్టెయిన్, వెయ్యి మందికి కొరుకుడు మసాజ్‌లో శిక్షణ ఇచ్చి, మసాజ్ సెంటర్‌ను నడుపుతోంది. అన్నట్టు ఒక సెషన్ మసాజ్‌కు డా.డోరోతి 150 యూఎస్ డాలర్లను ఛార్జ్ చేస్తోంది. అంటే మన కరెన్సీలో దాదాపు 10 వేల రూపాయలన్నమాట. ఇప్పటిదాకా ఈ మసాజ్ చేయించుకున్నవారంతా డాక్టర్‌కు మంచి కితాబే ఇచ్చారట. మసాజ్ బాలేదని ఎవరూ అనలేదట.మరీ మీరు ప్రయత్నించండి ఈ కొరుకుడు మసాజ్..



























