దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో డి.వీ.వీ. దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్ పై దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం “ఆర్.ఆర్.ఆర్.” నిజాం పై తిరుగుబాటు చేసిన కొమరంభీం పాత్రలో యుంగ్ టైగర్ ఎన్టీఆర్, బ్రిటీష్ వారిని ఎదురించి నిలిచిన అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు.
అయితే వీరిద్దరితో పాటు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ జత కలిశారు. పూణే కి సంబందించిన ఒక కీలక ఎపిసోడ్ లో అజయ్ నటిస్తున్నారట. ఈరోజు (మంగళవారం) నుండి అయన ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ఎస్.ఎస్. రాజమౌళి తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసారు. “అజయ్ దేవగన్ తో తాజాగా షెడ్యూల్ ప్రారంభిస్తున్నందుకు ఆర్.ఆర్.ఆర్ ఏంతో థ్రిల్ గా ఫీల్ అవుతుందని, వెల్కమ్ సార్” అని ట్వీట్ చేసారు.
ఇప్పటికే రామ్ చరణ్ తో వికారాబాద్ అడవుల్లో యాక్షన్ సన్నివేశాలు పూర్తిచేశారు. దానికిముంది ఎన్టీఆర్ పై పలు కీలక సన్నివేశాలు పూర్తిచేశారు. తాజాగా ఇంకో షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఈ ఏడాది జులై 30 న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.



























