ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు మరోఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ ద్వారా మనీని ట్సాన్స్ ఫర్ చేసే అవకాశాన్ని కల్పిచ్చింది. మనీ ట్రాన్స్ఫర్ చేసేందుకు బ్యాంక్‌కు వెళ్లే అవసరం లేకుండా వాట్సాప్ ద్వారా డబ్బుల్ని పంపించవచ్చు.

అయితే వాట్సాప్ ఈ సదుపాయాన్ని గతేడాది అందుబాటులోకి తెచ్చింది. కానీ చాలా మందికి ఆ ఫీచర్ అందుబాటులోకి రాకపోవడంతో మార్పులు చేసుకుంటూ వచ్చింది. తాజాగా దీనిపై కొత్త అప్ డేట్ తో ముందుకు వచ్చింది. ఇకపై ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు వాట్సాప్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని అధికారికంగా ప్రకటించింది.































