మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ “ఇడియట్” సినిమా.. డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఈ చిత్రంతో హీరోగా రవితేజ, డైరెక్టర్ గా పూరి జగన్నాద్ లకు ఎంత పేరు వచ్చిందో.. ఆ సినిమాలో నటించిన హీరోయిన్ రక్షిత కు కూడా అంతే క్రేజ్ వచ్చింది. ఆమెకు తెలుగులో ఇది తోలి చిత్రం. నటించిన తొలి చిత్రంతోనే ప్రేక్షకులను తన అందంతో, నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో మరికొందరు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కూడా వచ్చింది. చిరంజీవి సరసన “గోవిందుడు అందరివాడు” చిత్రంలో, నాగార్జున తో “శివమణి”, మహేష్ బాబు కి జతగా “నిజం”, ఎన్టీఆర్ “ఆంధ్రావాలా” వంటి సినిమాలతో స్టార్ హీరోల సరసన నటించింది రక్షిత. ఆ సమయంలో రక్షిత క్రేజ్ మామూలుగా లేదు. కొన్ని సినిమాలకు ఆమె కోసం మాత్రమే వెళ్లిన అభిమానులు కూడా ఉన్నారు. అప్పట్లో కుర్ర కారుని ఒక ఊపేసింది రక్షిత. తన అందంతో అలా కట్టిపడేసేది ఆమె.

అయితే రక్షిత అసలు పేరు శ్వేత. పుట్టి పెరిగిందంతా బెంగళూరులోనే. తల్లిదండ్రులిద్దరూ సినిమా ఇండస్ట్రీలోనే ఉండటంతో ఆమెకు సినిమా ఎంట్రీ సులువుగానే వచ్చింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోనే పునీత్ రాజ్‌కుమార్ సరసన అప్పు అనే కన్నడ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాకి పూరీ జగన్నాథ్ డైరెక్టర్. అప్పు సినిమాకి రిమేక్ గా తెలుగులో ‘ఇడియట్’ చేసారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడంతో రక్షిత కు అవకాశాలు భారీగా వచ్చాయి.

అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే కన్నడ దర్శకుడు ప్రేమ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రక్షిత. 2007 లో వీరి వివాహం జరిగిన తరువాత ఆమె సినిమాల్లో నటించలేదు. పెళ్లి తరువాత రక్షిత సినిమాల వైపు చూడలేదు. మెల్ల మెల్లగా ఆమె ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. ప్రస్తుతం కొన్ని కన్నడ టీవీ షో లలో జడ్జి గా వస్తున్నారు రక్షిత. ఇప్పుడు ఆమెను చుసిన వారు మాత్రం షాక్ అవుతున్నారు. ఇడియట్ సినిమాలో హీరోయిన్ గా మంచి స్ట్రక్చర్ మెయింటైన్ చేసిన రక్షిత ఇప్పుడు బాగా లావుగా కనిపిస్తున్నారు. ఎంతగానో లావైపోయిన ఆమెను చూసి అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. రక్షిత ఇలా అయిపోయిందేంటి? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అయితే తనకు కొడుకు పుట్టాక థైరాయిడ్ సమస్య రావడంతో ఇలా లావెక్కానని రక్షిత ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయినా నాజూకుగా ఉండటానికి ఇప్పుడు తానేమీ హీరోయిన్ను కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె నిర్మాతగా మారి ఏక్ లవ్ యా అనే సినిమాను నిర్మిస్తోంది. అంతేకాదు, చాలా రోజుల తరువాత ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తోంది. గతంలో రెండు పార్టీలు మారిన ఆమె ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతోంది.



























