సినీ క్రిటిక్ మరియూ నటుడు కత్తి మహేష్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.. కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తుంది. కొద్ది గంటలు గడిస్తే కాని అయన ఆరోగ్యంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేమని అంటున్నారు వైద్యులు. ఈ నేపధ్యంలో కత్తి మహేష్‌కి ఇలా రోడ్డు ప్రమాదం జరగడంపై ఆయనని ద్వేషించే కొందరు కౌంటర్స్ వేస్తున్నారు.

తాజాగా సినీ నటి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. రాముడిని, సీతని.. నీ అవసరానికి ఇష్టమొచ్చినట్టుగా వాడుకున్నావ్, వదిలేశావ్. ఏళ్ల నుంచి పద్దతిగా తన పని తాను చేసుకునే బ్రహ్మణ అమ్మాయిని.. నువ్ ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటున్నాను.. ఎందుకంటే ఇకనైనా అసలు జీవితాన్ని చూస్తావ్ అని. ఇప్పటికైనా అమ్మాయిలను, అమ్మని గౌరవించడం నేర్చుకో జై శ్రీరామ్ అని పూనమ్ కౌర్ ట్వీట్ వేశారు. అయితే ఇందులో అతని పేరు ఎక్కడా ప్రస్తావించకుండా పరోక్షంగా అతనిపై సెటైర్ వేసింది.

ప్రస్తుతం పూనమ్ కౌర్ ట్వీట్ పై సినీ వర్గాలలో చర్చ మొదలైంది. అయితే గతంలో కత్తి మహేష్.. పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ లకు సంబంధించి మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ చేసిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో పూనమ్ కౌర్ ఆయనపై ఘాటుగానే స్పందించింది.. అయితే ఆటను అంత ప్రాణాపాయమైన పరిస్థితిలో ఉంటే పూనం కౌర్ ఇటువంటి ట్వీట్ చేయడంపై మండిపడుతున్నారు నెటిజన్లు..
Karma devo Bhava!!
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) June 26, 2021
Tune Na Raam aur sita ko choda apne faide k liye ,na us ladki ko jo bhramin ka dincharya saalon tak karti thi ,mein chahti hoon ki Tu zinda rahe taki Tu asli zindagi dekhe , aurton ki aur apni khud ki maa ki bhi izzat karna seekhe! #JaiShreeRam
































