ఏడాదిన్నర వయసున్న పసిపాపపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డి ఆ చిన్నారి మరణానికి కారకుడయ్యాడు. హృదయ విదారకమైన ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఏడాదిన్నర వయసున్న చిన్నారి సోమవారం రాత్రి తన ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా.. ముప్పయ్యేళ్ల వయసున్న నిందితుడు ఆమెను ఎత్తుకెళ్లి.. అత్యాచారానికి పాల్పడ్డాడు.

తీవ్ర రక్తస్రావంతో అచేతనంగా పడి ఉన్న చిన్నారిని చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అక్కడే ఉన్న నిందితుడిని పట్టుకొని గ్రామస్థులు చితకబాదారు. అత్యాచారానికి గురైన చిన్నారి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.































