ఆంధ్రప్రదేశ్లో కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయ్యేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ రోజు ఉదయం 9 వరకు అందిన లెక్కల ప్రకారం గత 24 గంటల్లో 7,504 మంది ఆస్పత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యారు. మొత్తంగా 55,002 పరీక్షలు చేయగా 2,620 మంది కరోనా పాజిటివ్ అని తేలింది. గత 24 గంటల్లో కరోనాతో 44 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58,140 కరోనా పాజిటివ్ కేసులున్నాయి.
































