గత సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ ను నియంత్రించడంలో దేశానికే ఆదర్శంగా నిలిచినా కేరళ రాష్ట్రం పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ఓవైపు కొవిడ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో పాటు మరోవైపు జికా వైరస్ కూడా కలకలం రేపుతోంది. రాష్ట్రంలో రోజుకు సుమారు 12-15 వేల మధ్య కరోన పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

ఇప్పటి వరకు మొత్తం 30.39 లక్షల కేసులు నమోదైన రాష్ట్రంలో క్రియాశీలక కేసుల సంఖ్య 1,13,115 కి చేరింది. అయితే రాష్ట్రంలో కొవిడ్ నిబంధనలను సడలించడం వల్లే కేసులు పెరుగుతున్నాయని.. కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ చెబుతున్నారు. ఇదలావుండగా మరోవైపు రాష్ట్రంలో 14 జికా వైరస్ కేసులు బయటపడ్డాయి. దేనితో కేరళ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.



























