ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్ ఇటీవలే మృతి చెందిన విషయం తెలిసిందే.. అయితే నిన్న కత్తి మహేష్ స్వగ్రామం అయిన చిత్తూరు జిల్లా ఎలమందలో అయన అంత్యక్రియలు జరిగాయి. ఈ క్రమంలో అయన అంత్యక్రియలకు రాజకీయ ప్రముఖులతో పాటూ అయన అభిమానులు కూడా చాలా మంది హాజరయ్యారు. అందులో MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ఉన్నారు.

కత్తి మహేష్ కు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. కత్తి మహేష్ మృతిపై అయన అనేక అనుమానాలు లేవనెత్తారు. ఆక్సిడెంట్ జరిగిన తీరు చూస్తుంది అనుమానం కలుగుతుందని.. అసలు ఏ విధంగా ఆక్సిడెంట్ జరిగింది, అసలు హాస్పిటల్ ఏం జరిగింది అనే విషయాలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేసారు.































