కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని తీవ్రంగా వణికిస్తున్న వైరస్. అంతకంతకూ వ్యాపిస్తోంది. చైనా నుంచి వ్యాపించిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను గజ గజ వణికిస్తోంది. పాములా నుంచి ఈ వైరస్ సోకినట్టుగా డాక్టర్లు అనుమానిస్తున్నారు. దీని ప్రభావంతో చైనాలో ఇప్పటికే 150 మందికి పైగా చనిపోయారు. ఈ తీవ్రత కారణంగా చైనా ఆర్ధిక శాఖ 9 బిలియన్స్ ప్రకటించింది. ఈ మహమ్మారిని తరిమేందుకు ప్రత్యేకంగా ఒక ఆసుపత్రిని సైతం నిర్మిస్తోంది.
ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ ఇప్పుడు ఇండియాలో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. దేనితో భారత ప్రభుత్వయం ముందుగా జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుతం అవగాహన కార్యక్రమం చేపట్టింది. విదేశాలనుంచి వచ్చే ప్రయాణికులను ఎయిర్పోర్టులో క్షుణ్ణంగా పరీక్షించి బయటకి పంపుతుంది. వ్యాదిలక్షణాలు ఉన్న ప్రయాణికులకు ప్రత్యేక వైద్యాన్ని అందిస్తుంది.
అయితే కరోనా వైరస్ గురించి పోతులూరి వీరబ్రహ్మం గారు ముందే చెప్పారని, బ్రహ్మం గారి కాలజ్ఞానంలో 114వ పద్యం “కోరంకి” అనే జబ్బు గురించి రాసి ఉందని. అది భారతదేశానికి ఈశాన్య దిక్కున ఉన్న దేశంలో పడుతుందని రాశారు. భారత్ కి ఈశాన్య దిక్కున ఉన్నది చైనానే కదా !! 17వ శతాబ్దములో కాలజ్ఞానతత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త, దైవ స్వరూపులైన బ్రహ్మం గారు చెప్పిన విషయాలు నియమయ్యాయని అంటున్నారు. ప్రస్తుతం “కరోనా” వైరస్ సృష్టిస్తున్న బీపత్సం బ్రహ్మంగారు చెప్పిన పద్యానికి సరిగ్గా సరిపోతుంది.
“ఈశాన్య దిక్కున విషపుగాలి పుట్టెను
లక్షలాది ప్రజలు సచ్చేరయ
కోరంకియాను జబ్బు కోటిమందికి తగిలి
కోడిలా తూగి సచ్చేరయ”
ఈ పద్యం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయింది. ఆదాల ఉండగా, కరోనా వైరస్ మన దేశంలో కనిపించకపోయినా కేంద్ర ప్రభుతం తగు జాగ్రత్తలు తీసుకుని దానిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టింది.



























