సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. సంక్రాతి కానుకగా వచ్చి, రిలీజ్ అయిన తొలిరోజునుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి, భారీ కలెక్షన్ల దిశగా దూసుకెళ్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా మరిన్ని కామెడీ సీన్స్ జోడించి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి స్వయంగా వెల్లడించాడు.
ఈ శుక్రవారం నుంచి ఈ సినిమాలో మరిన్ని సీన్స్ యాడ్ చేస్తున్నామని అనిల్ తెలిపారు. మీకోసం మరి కొన్ని నవ్వులు వస్తున్నాయి అంటున్నాడు. ఇప్పటికే 200 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ సినిమా ఈ సీన్స్ ఆడ్ చేయడం ఎంత వరకు కలెక్షన్లు పెంచుతాయో వేచి చూడాల్సిందే..



























