చిన్న వివాదం ఒక ట్రక్కు డ్రైవర్ ప్రాణాలతో చెలగాటం ఆడాల్సివచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని ఓ కారు ఓనర్ కోపంలో రెచ్చిపోయాడు. తన కారును అడ్డంగా నుంచున్న ట్రక్కు డ్రైవర్ కు చుక్కలు చూపించాడు. వివరాల్లోకి వెళితే.. ఉతరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఓక కారును ట్రాఫిక్ లో అనుకోకుండా ఒక ట్రక్కు గుద్దింది. ఈ నేపధ్యంలో కారు నడుపుతున్న యువకులు మరియూ ట్రక్కు డ్రైవర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వాగ్వాదం జరుగుతున్న సమయంలో ఆ యువకులను వెళ్ళనివ్వకుండా అడ్డంగా నుంచున్నాడు ట్రక్కు డ్రైవర్.

ఈ క్రమమలో కోపంతో చిర్రెత్తిన యువకులు ట్రక్కు డ్రైవర్‌ను కారుపై పడుకోబెట్టి సుమారొ 5 కిలోమీటర్లు స్పీడ్‌గా తీసుకెళ్లాడు. ఈ నేపధ్యంలో ట్రక్కు డ్రైవర్ భయంతో కారును గట్టిగా పట్టుకొని అలానే ఉండిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నేట్టింట వైరల్ అయింది. ఈ తతంగం అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీనిపై పోలీసులు ఆయువకులపై కేసుపెట్టారు. ఇక ఈ విడియో చూసిన నెటిజన్లు కారు ఓనర్ తీరుపై మండిపడుతున్నారు.



























