దర్శకుడు అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని ఊరికే అనరు.. అసలు సినిమా మొత్తాన్ని తన భుజస్కందాలపై వేసుకుని నడిపించేవాడే దర్శకుడు. అటువంటి దర్శకులకు ఎంత తెలివితేటలూ ఉండాలి. ఇక మన టాలీవుడ్ లో అద్భుతమైన దర్శకులకు కొదవే లేదు..

అందులో చాలా మంది దర్శకులు ఉన్నత చదువులు పూర్తి చేసిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చారు. మరి టాలీవుడ్లో హైలీ ఎడ్యుకేటెడ్ దర్శకులు ఎవరో ఒక లూక్కేద్దాం..

త్రివిక్రమ్ శ్రీనివాస్
న్యూ క్లియర్ ఫిజిక్స్‌లో ఆంద్రా యూనివర్సిటీ నుంచి M.Sc పూర్తి చేసారు. అందులో గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు. అంతేకాదు ఆపై మేథమేటిక్స్ మరియూ సైన్స్ టీచర్‌గానూ పని చేసిన అనుభవం త్రివిక్రమ్ కు ఉంది.

సుకుమార్
మేథమేటిక్స్ లో డిగ్రీ చదివారు. లెక్కల్లో టాపర్ అయిన ఈ లెక్కల మాస్టారు కాకినాడలోని ఆదిత్య జూనియర్ కాలేజ్‌లో మ్యాథ్స్ ట్యూటర్ గా పనిచేసారు.

శేఖర్ కమ్ముల
హైదరాబాద్ సీబీఐటీ నుంచి బిటెక్ పూర్తీ చేసారు. ఆపై న్యూజెర్సీలోని హోవర్డ్ యూనివర్సిటీలో ఎం.ఎఫ్.ఏ చేసారు.

శ్రీనివాస్ అవసరాల
శ్రీనివాస్ అవసరాల మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తీ చేసి ఆపై సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

కొరటాల శివ
కొరటాల శివ బి-టెక్ పూర్తీ చేసారు. ఆపై టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

శ్రీకాంత్ అడ్డాల
శ్రీకాంత్ అడ్డాల Msc ఫిజిక్స్ పూర్తీ చేసారు.

క్రిష్ జాగర్లమూడి
క్రిష్ జాగర్లమూడి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేసారు.

దేవ్ కట్టా
దేవ్ కట్టా మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తీ చేసారు.

రవి బాబు
రవి బాబు సింబోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పూణే నుండి MBA చేసారు.

ఇంద్రగంటి మోహనకృష్ణ
ఇంద్రగంటి మోహనకృష్ణ హైదరాబాద్ లోని లయోలా కాలేజ్ నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఆపై యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఫిలోసఫీ పూర్తి చేసారు.



























