బుల్లితెర మీద పేరు గడించిన టాప్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. సినిమాలతో ఎంట్రీ ఇచ్చినా ఆపై బుల్లితెరపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ.. వచ్చిన సినిమా ఆఫర్లనూ కూడా వదులుకోకుండా వెండితెరపై కూడా ఈమధ్య బిజీ బిజీగానే ఉంటోంది నటి రష్మీ. కెరీర్ స్టార్టింగ్ స్టేజ్‌లోనే సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చిన వైజాగ్ బ్యూటీ రష్మి గౌతమ్.. కానీ టాలీవుడ్ లో ఊహించినంత సక్సస్ కాలేకపోవడంతో ‘జబర్దస్త్’ అంటూ స్మాల్ స్క్రీన్ వైపు అడుగులేసింది. అక్కడ జబర్థస్త్ షో బాగా క్లిక్ అవ్వడంతో పాటు తన అందాలతో యువతరాన్ని టీవీలకు అతుక్కుపోయేలా చేసింది. తెలుగు సరిగ్గా రాకపోయినా సరే పట్టుదలగా నేర్చుకుని యాంకరింగ్ చేసి చాలా తక్కువ టైంలోనే తెలుగులో టాప్ యాంకర్స్ లిస్ట్‌లో చేరిపోయింది ఈ ముద్దుగుమ్మ.

వీధికుక్కల చిన్న గాయమైనా చలించిపోయే మనస్థత్వం రష్మిది. చిన్న పిల్ల మాదిరి ఏడ్చేస్తుంది. ఇదివరకే సోషల్ మీడియాలో తన ఆవేదనలు తెలిజేసిన విషయం తెలిసిందే.. ఇక తన వ్యక్తిగత జీవితంలో కూడా రష్మీ చాలా కష్టాలు పడిందట యాంకర్ రష్మి. ఒకవైపు కుటుంబం కోసం , మరో వైపు తన కెరీర్ కోసం ఆమె ఎన్నో కష్టాలు అనుభవించారు. అయితే తాజగా స్టార్ మాలో ప్రసారం అవుతున్న సిక్స్త్ సెన్స్ ప్రోగ్రాం గెస్ట్ గా వచ్చింది రష్మి. అయితే ఈ సంధర్బంగా తన పేరెంట్స్ విషయంలో ఆమె పడిన మానసిక వేదన గురించి తెలియజేసారు. సింగిల్ మదర్ గా తన తల్లి తనకోసం కుటుంబం కోసం పడిన కష్టాలన్నీ తలచుకొని రష్మి కూడా ఏడ్చేసింది. అయితే కారణం చెప్పలేదు కానీ రష్మీ తండ్రి వాళ్ళ అమ్మను, పిల్లలను వదిలేసి వెళ్లిపోయారట.

పిల్లలకు పలానా వారి కడుపున పుట్టాలి అని నిర్ణయించుకునే ఛాయిస్ ఉండదు. అలాగే బంధాలు విడదీసే, కలిపే శక్తి మరియూ మెచ్యూరిటీ కూడా పిల్లలకు ఉండదు. అదంతా కేవలం పేరెంట్స్ పైనే ఉంటుంది. పెళ్లి, లివింగ్ రిలేషన్ ఏదైనా కావొచ్చు కానీ తమ మధ్యలో బంధం స్ట్రాంగ్ గా లేనప్పుడు పిల్లల్ని కనకండి అని అన్నారు యాంకర్ రష్మీ. కలిసి ఉంటామనే నమ్మకం మీకు లేనప్పుడు పిల్లల్ని కని, వాళ్లపై బాధ్యతలు వదిలివేయకండి అంటూ ఎమోషనల్ అయ్యారు. మీపాటికి మీరు పిల్లల్ని కనేసి మధ్యలో వదిలి వెళ్ళిపోతే ఆ తరువాత పిల్లలు ఎన్ని బాధలు పడాలో తెలుసా? మీకు కలిసి ఉండే ఉద్దేశ్యం లేనప్పుడు వాళ్ళను అసలు ప్రపంచంలోకి తీసుకురాకూడదు అంటూ రష్మీ అన్నారు. సిక్స్త్ సెన్స్ ప్రోమోలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాలి అంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.






























