ఇది వరకు ‘డేటింగ్’ అనే పదం వినగానే అదేదో పెద్ద నేరం అన్నట్టు చూసేవారు. కానీ ఇప్పుడు సెలబ్రిటీలకే కాదు సాధారణ జనాలకు కూడా ‘డేటింగ్’ పదం చాలా చిన్నదైపోయింది. పెళ్లి కాకముందే ముందే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి జీవించి జీవించడం.. ఆ తర్వాత నచ్చితే పెళ్లి.. లేకపోతె ఎవరి దారి వారిది.. ఇదే నేడు జరుగుతుంది. ప్రస్తుతం మనం ఎక్కువగా చూస్తున్నవి ఇవే.. ఇక సినిమా వాళ్ళు అయితే ఈ విషయాలను ఓపెన్ గానే చెప్పేస్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే.. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే..అంతేకాదు అందులో నటించిన నటీనటులకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాలో నటించిన ఫ్రీదా పింటో నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ హీరోయిన్ ఇప్పుడు పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది. ఇది గాసిప్ కాదండీ బాబూ.. ఈ విషయాన్నీ స్వయంగా హీరోయిన్ ఫ్రీదా పింటోనే తెలియజేసింది. ఈ క్రమంలో తన ప్రియుడు కోరి ట్రాన్ తో కలిసి దిగిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది.

ఇక 2017 నుండీ వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. ఎంగేజ్మెంట్ చేసుకుందాం అని అనుకున్నా.. అది కాస్తా కరోనా మహమ్మారి వాళ్ళ పోస్ట్ పోన్ అయింది.. ‘పెళ్లయితేనే కలవాలా? ఆ ఆలోచన వస్తే మేము ఒకటైనట్టే’ అంటూ మోరల్స్ చెబుతుంది ఈ జంట. ఈ క్రమంలో ఫ్రీదా పింటో తానూ గర్భవతి అంటూ సోషల్ మీడియా లో ప్రకటించడంతో ఈ జంటకు సుభాకాంక్షలు చెబుతున్నారు అభిమానులు, సన్నిహితులు..































