తెలంగాణ రాష్ట్రంలోని ప్రగతిభవన్‌లో ఒక యువతి గట్టిగా కేకలు వేస్తూ హల్‌చల్ చేసింది. వివరాల్లోకి వెళితే.. ప్రగతి భావన్లో ‘దళిత్ ఎంపవర్‌మెంట్ స్కీమ్’ కోసం అఖిలపక్ష సమావేశం జరుగుతంది. ఈ క్రమంలో ఒక యువతి తమకు ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని, డబుల్‌బెడ్‌రూం ఇల్లు ఇవ్వాలని గట్టిగా కేకలు వేస్తూ ప్రగతిభవన్ ఎదుట బైఠాయించింది. అ యువతి ఆర్మూర్ ప్రాంతానికి చెందిన తలారి రాజ్యలక్ష్మి(21) గా గుర్తించారు. కుకట్ పల్లి లోని ఒక హాస్టల్‌లో నివశిస్తూ చదువుకుంటోంది.

అయితే ఆదివారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చి ప్రగతి భవన్ ఎదుట బైఠాయించింది.. ఈ నేపధ్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు, డబుల్‌బెడ్‌రూం ఇల్లు ఇవ్వాలని.. అదే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల గురించి పట్టించుకోవాలంటూ గట్టిగా నినాదాలు చేసింది. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.



























