ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్”చిత్రం తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా నటీనటులను ఎంపిక చేసుకుంటోంది. జులై రెండో వారంలో షూటింగ్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఆ షెడ్యూల్‌లో జాయిన్ కానున్నట్టు బీటౌన్ వర్గాల సమాచారం. ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్ డేట్ ఒకటి తెరపైకి వచ్చింది. ప్రముఖ మరాఠి యాక్టర్ దేవ్‌దత్తా లార్డ్ హనుమాన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

త్వరలోనే తన పార్టు షూటింగ్ లో చేరనున్నాడట దేవ్‌దత్తా. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఓం రావత్ డైరెక్షన్లో ‘ఆదిపురుష్’ తెరకెక్కుతుండగా.. ప్రభాస్ రాముడి పాత్రలో, కృతిసనన్ సీతగా కనిపించనున్నారు.






























