ప్రేమి విశ్వనాథ్ అంటే మన తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ కార్తీక దీపం వంటలక్క అంటే మాత్రం టక్కున గుర్తు పట్టేస్తారు. అంతలా ‘కార్తిక దీపం’ సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది ప్రేమి. చిన్నా, పెద్దా, ఆడ, మగా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ రాత్రైతే చాలు టీవీలకు అతుక్కు పోయేలా చేస్తోంది మన వంటలక్క. వంటలక్క నట విశ్వ రూపానికి టీఆర్పీ రేటింగ్స్ లో కూడా మరే ఇతర సీరియల్స్ పోటీ పడలేకపోతున్నాయి. దీప అలియాస్ వంటలక్క క్యారెక్టర్ చేస్తున్న నటి ప్రేమి విశ్వనాథ్ ఈ సీరియల్ ద్వారా ఎంతగా పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

ఇక ఈ టీవీ సీరియల్‌తో వచ్చిన క్రేజ్.. ఆమెకు వెండితెరపై అవకాశాలు కూడా తెచ్చిపెడుతుంది. అయితే ప్రేమి విశ్వనాథ్ ఇప్పటి వరకు ఏ సినిమాకి కూడా సైన్ చేయలేదు. కానీ తాజాగా ఒక తెలుగు సినిమాకు ప్రేమి విశ్వనాథ్ ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని హీరోగా దర్శకుడు లింగుస్వామి తెరకెక్కే నూతన చిత్రంలో ప్రేమి విశ్వనాథ్ కు మంచి రోల్ చేయడానికి వంటలక్క చెప్పినట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలో దర్శకుడు లింగు స్వామి సినిమా కథతో పాటూ ప్రేమి విశ్వనాథ్ ఇంటికి వెళ్లి ఆ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో వివరించాడట. లింగుసామి చెప్పిన పాత్ర నచ్చడంతో వంటలక్క ఈ సినిమాలో నటించడానికి ఒకే చెప్పిందని తెలుస్తుంది. అయితే త్వరలో ప్రేమి విశ్వనాథ్ టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీకి గురించి అపీషియల్ ప్రకటన చేయబోతున్నారని సమాచారం. బుల్లితెరపై తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన వంటలక్క బిగ్ స్క్రీన్ పై ఏ రేంజ్‌లో అలరిస్తుందో వేచి చూడాలి..

































