1984 తర్వాత నందమూరి బాలకృష్ణ మంగమ్మగారి మనవడు హిట్టుతో ఆయన మంచి జోష్ లోకి రావడం జరిగింది. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అండ్ హిట్స్ గా నిలిచి పోయాయి. మంగమ్మగారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, మువ్వగోపాలుడు, ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు ఇలాంటి చిత్రాలు ఆ రోజుల్లో బాలయ్య బాబును తారా స్థాయికి తీసుకెళ్లాయి.

1989 పి.వి.ఆర్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఎన్.వి.ఆర్.ప్రసాద్ నిర్మాణం, కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ సుహాసిని హీరో, హీరోయిన్లుగా ‘బాలగోపాలుడు’ చిత్రం విడుదలయింది. పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో బాలకృష్ణకు ఒక అనాధ అమ్మాయిగా రాశి కనిపిస్తుంది. రాశి 1986లో మమతల కోవెల సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత రావుగారి ఇల్లు, అంకురం, ఆదిత్య369 లాంటి చిత్రాల్లో బాలనటిగా నటించి ఆ తర్వాత తమిళ చిత్రం ప్రియమ్ లో రాశి హీరోయిన్ గా కనిపించారు. ఆమె తన తండ్రి ప్రోద్బలంతో సినిమా రంగంలోకి అడుగు పెట్టినారు. తన తండ్రి తరువాత తనకు సంబంధించిన అనేక విషయాలను అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ తో చెప్పుకునేది.

ఆయా విషయాల్లో మంచిచెడుల గురించి దర్శకుడు శ్రీనివాస్.. రాశి కి వివరిస్తూ ఉండేవాడు. తనను ఎంతోమంది బిజినెస్ మేన్స్ పెళ్లి చేసుకుంటానని వచ్చినా కూడా కాదని తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసుని ఆమె పెళ్లి చేసుకున్నారు. 1997లో సూపర్ గుడ్ ఫిలింస్ నిర్మాణంలో భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన శుభాకాంక్షలు చిత్రంలో రాశి హీరోయిన్ గా మొదటిసారి తెలుగు తెరపై కనిపించారు. ఆ తర్వాత గోకులంలో సీత, గిల్లికజ్జాలు, పెళ్లి పందిరి, ప్రేయసి రావే, నేటి గాంధీ, పండగ ఆ తర్వాత తిరిగి 1999 లో చంటి అడ్డాల నిర్మాణం, ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో, నటసింహ బాలకృష్ణ, మీనా, రాశి హీరోహీరోయిన్లుగా కృష్ణ బాబు చిత్రంలో నటించారు. అయితే రాశి బాలనటిగా బాలగోపాలుడు చిత్రంలో.. హీరోయిన్ గా కృష్ణ బాబు చిత్రంలో బాలయ్యబాబు తో నటించారు.






























