నిన్న శాసనమండలిలో ఒక వైపు వాడి వేడి చర్చ జరుగుతుంది, మరో వైపు టీడీపీ ఎం.ఎల్.ఏ. బాలకృష్ణ, వై.సి.పి. ఎం.ఎల్.ఏ రోజా నవ్వులు చిందిస్తూ తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అది వర్మ కంట పడింది.. ఇంకేముంది తనదైన శైలిలో ట్రోల్ చేయడం మొదలు పెట్టాడు. ఎవరిని వదలకుండా ట్రోల్ చేసే రాంగోపాల్ వర్మ రోజా-బాలయ్య సెల్ఫీని కూడా ట్విట్టర్ తనదైన ట్వీట్స్ రూపంలో ట్రోల్ చేసాడు.
అయితే రోజా చాలా అందంగా ఉందంటూనే, బాలకృష్ణ ను అయన ఎవరో తెలియదు అని, రోజా పక్కన దిష్టి బొమ్మలా ఉన్నాడని కామెంట్ చేసాడు. సెల్ఫీ లో రోజా గారు హీరో లా కనిపిస్తున్నారు కానీ ఆమె కుడి పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరోగాని ఈ ఫ్రెమ్ లో రోజా గారి అందాన్ని పాడు చేస్తున్నాడు. రోజా గారి పక్కన చాలా అసహ్యంగా ఉన్నాడు, బహుశా అతను ఆమెకు దిష్టి బొమ్మ కావచ్చు అంటూ ట్వీట్ చేసాడు. అంతేకాదు కాసేపుఆగి మరో ట్వీట్ చేసాడు “అందమైన రోజా గారి పక్కన కూర్చుని ఫోటో నాశనం చేస్తున్న వ్యక్తి ఎవరో నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి ” అంటూ మరో ట్వీట్ చేసాడు. ఆర్.జి.వి. ట్వీట్స్ పై బాలయ్య ఫాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Wowww Roja Garu looks like a HERO and some guy who I don’t know on her right looks like yuckk..He’s spoiling her beauty by spoiling the frame with his face …Or maybe he is her Dishti Bomma pic.twitter.com/4uO19G6rZL
— Ram Gopal Varma (@RGVzoomin) January 22, 2020
Can someone tell me who’s this guy spoiling the photo by sitting next to the pretty Roja ? pic.twitter.com/0oJJHAuuEV
— Ram Gopal Varma (@RGVzoomin) January 22, 2020



























