టాలీవుడ్ టాప్ కమిడియన్, వైఎస్సార్సిపి నేత అలీ బీజేపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా? అవుననే అంటుంటున్నారు రాజకీయవర్గాలు. తాజాగా అలీ ఉన్నట్టుండి ఢిల్లీలోని బిజెపి ఆఫీసులో ప్రత్యక్షమవడమే దీనికి కారణం. అలీ 2019 ఎన్నికలకు ముందు వైస్సార్సీపీలో చేరారు. జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఆశించిన టికెట్ రాకపోవడంతో పార్టీ తరుపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసారు. ఆయనకు నామినేటెడ్ పదివి కట్టబెడతారని కూడా ప్రచారం జరిగింది. ఆ పదవి కూడా రాకపోవడంతో ఆలీ పెద్దగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనలేదని వినికిడి.
తాజాగా ఇప్పుడు బీజేపీ ఆఫీసులో ప్రత్యక్షం అవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తనవ్యక్తిగత పని మీద వచ్చానని, ఓ హాలీవుడ్ డైరెక్టర్ త్వరలో ఇండియా వస్తున్నాడని, అయన మోడీని కలవాలని భావించడంతో ప్రధాని అపాయింట్మెంట్ కోసం ఢిల్లీ వచ్చాను అని వివరణ ఇవ్వడంతో ఈ విషయానికి తెరపడింది.



























