టాలీవుడ్ తాజా సంచలన తార శ్రీరెడ్డి మరో బాంబు పేల్చింది.తెలుగు పరిశ్రమలోని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి నన్ను వాడుకొని వదిలేశాడు అని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.ఇప్పటికే పలు వివాదాలతో సంచలనం సృష్టిస్తున్న ఈమె తాజాగా నేషనల్ మీడియాకి ఎక్కి దగ్గుబాటి కుటుంబంపై ఆరోపణలు చేసింది.
ఇన్నాళ్లు ఓ అగ్ర నిర్మాత కొడుకు అంటు వస్తున్న శ్రీరెడ్డి నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేరుగా సురేష్ బాబు పేరు బయటికి చెప్పేసింది.శ్రీరెడ్డి సరేష్ బాబు కొడుకు అని చెప్పింది కాని అతని పేరు మాత్రం చెప్పలేదు. సురేష్ బాబుకు ఇద్దరు కుమారులు రానా , అభిరాం అన్న విషయం తెలిసిందే . మొన్న ఫిలిం చాంబర్ వద్ద అర్థ నగ్న ప్రదర్శర చేసిన శ్రీరెడ్డిపై మా అసోసియేషన్ మెంబర్‌షిప్ ఇవ్వ అని తెగేసి చెప్పింది.దీనిపై స్పందించిన శ్రీరెడ్డి మా అసోసియేషన్ నాకు సభ్యత్వం ఇవ్వమని చెప్పడం చెస్తే ..నీకు జరిగిన అన్యాయం ఏంటి ? అని ఒక్కరు కూడా అడగలేదని తన ఆవేదనను జాతీయా మీడియాకు చెప్పుకుంది..



























