“భరత్ అనే నేను”, “మహర్షి”, సంక్రాంతికి రిలీజ్ అయిన “సరిలేరు నీకెవ్వరు” తో బ్లాక్ బస్టర్ ఫామ్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు. “సరిలేరు నీకెవ్వరు” చిత్రంతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లు వసూలు చేసారు. తన సినిమాల విషయంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్ట్రెటజీ ఫోలో అవుతుంటారు మహేష్. సినిమాల ఎంపికలోనే కాదు, ఆ సినిమాల ప్రమోషన్స్ లో కూడా తాను ప్రముఖ పాత్ర వహిస్తారు.
అయితే ఇప్పుడు మహేష్ బాబు మెమోలు స్కెచ్ లు వేయడంలేదు. పాన్ ఇండియా సినిమాలు చేయను.. “సినిమా బాగుంటేనే పాన్ ఇండియా రేంజ్ హిట్ అవుతుంది” అని చెప్పిన మహేష్ బాబు. తన తరువాత చిత్రం వంశి పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్నా సినిమాకు మాత్రం అదిరిపోయే స్కెచ్ వేశారు. అయినా మహేష్ బాబుది మాములు బ్రెయిన్ కదండీ బాబు.
తన తదుపరి చిత్రం #MB27 లో మన రౌడీ విజయ్ దేవరకొండని దింపుతున్నాడట. అదేనండి విజయ్ దేవరకొండ #MB27 లో కీలక పాత్ర పోషితున్నాడట. ఒక స్పెషల్ రోల్ కోసం విజయ్ దేవరకొండని సంప్రదించారట. ఈ పాత్ర సినిమాలో చాలా కీలమైనదట. ఈ విషయంపై ఇప్పటికే డైరెకర్ట్ వంశి, మహేష్ బాబు ఇద్దరు కలిసి విజయ్ తో మాట్లాడి ఒప్పించడం చక చకా జరిగిపోయాయట. ఈ విషయం పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
తాజా సమాచారం ప్రకారం ఇది ఒక గ్యాంగ్ స్టర్ నేపధ్యం ఉన్న సినిమా అని, మహేష్ ఇందులో గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడని తెలిసింది. ఇందులో కైరా అద్వానీ కథానాయిక గా నటిస్తోంది. గతంలో మహేష్, వంశీల కాంబినేషన్లో వచ్చిన “మహర్షి” చిత్రం భారీ హిట్ సాధించింది. ఈ సినిమా తరువాత మళ్ళి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్నా ఈ చిత్రానికి భారీ అంచానాలే ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
ప్రస్తుతం సక్సెస్ ని ఎంజాయ్ చేయడానికి మహేష్ ఫ్యామిలీతో విదేశాలకు చెక్కేసాడు, అయన తిరిగి రాగానే ఈ చిత్ర షూటింగ్ స్టార్ట్ చేస్తారట. ఇటీవలే ఆర్మ్ రోల్ లో కనిపించిన మహేష్ బాబు, ఈ సినిమాలో మహేష్ లుక్ కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.



























