సదా – ‘జయం’ సినిమాలో ‘వెళ్లవయ్యా.. వెళ్లు వెళ్లు..’ అనే ఒకే ఒక్కడైలాగ్ సదాకి స్టార్ డం తీసుకొచ్చింది. నేటికీ సదాని ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారంటే ఈ డైలాగ్ మహత్యమేనని చెప్పవచ్చు. ఆ తరువాత ఒక్కసారిగా బిజీ హీరోయిన్ అయిపోయారు సదా.. తెలుగు తో పాటూ తమిళ్, కన్నడ బాషలలో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్నారు. అయితే మొదట్లో ఎంత ఫాస్ట్ గా స్టార్ డం అందుకుందో అంతే త్వరగానే ఆమె కెరీర్ డౌన్ అయ్యింది. వరుస పరాజయాలతో ఫెడ్ ఔట్ అయిపోయారు. తాజాగా ఈటీవీలోని ‘అలీతో సరదాగా’ ప్రోగ్రాం కి వచ్చిన సదా పలు ఆశక్తికర విషయాలు వెల్లడించారు.

విక్రమ్ హీరోగా నటించిన అపరిచితుడు సినిమా ఎంతటి విజయాన్ని అందించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే సదా కెరీర్ లో అతిపెద్ద హిట్ అపరిచితుడు సినిమానే.. ‘అన్నియన్’ పేరుతో డైరెక్టర్ శంకర్ తమిళంలో తెరకెక్కిన ఆ చిత్రం తెలుగులో ‘అపరిచితుడు’గా రిలీజ్ అయింది. అయితే ఈ చిత్రం షూటింగ్ సమయంలో హీరో విక్రమ్.. సదాను చెల్లెమ్మ అని పిలిచారట. అది విన్న డైరెక్టర్ ఒక్కసారిగా శంకర్ షాక్ అయ్యారట. మీ ఇద్దరినీ నేను రాముడు, సీతలా చూపించాలనుకుంటున్నా.. మీరేంటి అన్నా,చెల్లి అని పిలుచుకుంటున్నారు. ఒక వేళ మీ రిలేషన్ బయట తెలిస్తే ఇక నా సినిమా ఎవరూ చూడరు అంటూ గట్టిగా చెప్పారట శంకర్.

సినిమాలో రోమాన్స్ చేసే హీరో హీరోయిన్స్ ఆఫ్ స్క్రీన్ లో అన్నా, చెల్లెల్లా ఉంటారని తెలిస్తే.. అప్పుడు ఆడియన్స్ సినిమాలోని మనం చూపించే రొమాన్స్ ఫీల్ అవ్వరు. ఒక వేళ అలా జరిగితే అది సినిమా ఫలితాన్నే దెబ్బ తీస్తుందని చెప్పారట డైరెక్టర్ శంకర్. ఇక ఇదే షోలో చాలా విషయాలను సదా పంచుకున్నారు. జయం సినిమా షూటింగ్ అవుతున్న సమయంలో తన తండ్రితో కారులో ప్రయాణిస్తుంటే ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో తీవ్రమైన గాలు కూడా అయినట్టు వెల్లడించారు. అదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన డాన్సర్ అని అతనిలాంటి డాన్సర్ ని ఇప్పటి వరకు చూడలేదని అన్నారు సదా..

































