తెలుగులో చక్కగా నటించగలిగే సత్తా ఉన్న యంగ్ హీరోయిన్ మాధవీ లత. మాధవీ లత అమ్మా నాన్న కర్ణాటక లోని బళ్ళారి. ఆమె 1988, అక్టోబరు 2న జన్మించింది. బాల్యం, చదువు బళ్ళారిలోనే సాగింది. ఎ.ఎస్.ఎం.మహిళా కళాశాలలో సోషియాలజీలో డిగ్రీ చేసింది. తరువాత గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో ఆనర్స్ డిగ్రీ చేసింది. కన్నడ కుటుంబంలో పుట్టినా తెలుగు, తమిళ భాషలు ధారాళంగా మాట్లాడుతుంది. మాధవీ లతకి సినిమాల మీద చాలా ఆసక్తి ఉండేది. హీరోయిన్ అవ్వాలనే కోరిక తనలో బలంగా ఉండేది.

దాంతో టాలీవుడ్‌లోకి ఎంటరయిన మాదవీ లత కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలో నటించే అవకాశాలను అందుకుంది. అలా దర్శకుడు రవిబాబు కంట్లో పడటంతో, ఆయన 2008లో వచ్చిన నచ్చావులే సినిమా ద్వారా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తనీశ్ హీరోగా నటించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత రామోజీ రావు నిర్మించారు. ఈ సినిమా తర్వాత మాదవీ లతకి మంచి క్రేజ్ వచ్చింది. దాంతో తెలుగులో వరుసగా ఆఫర్స్ వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఎందుకనో ఆమెకి ఆశించినంతగా అవకాశాలు దక్కలేదు.

ఈ సినిమా తర్వాత మాధవీ లత చెప్పుకోగదిన సినిమా అంటే నేచురల్ స్టార్ నానితో స్నేహితుడా. ఇందులో ఆమె కాస్త గ్లామర్ గాను కనిపించింది. కానీ ఈ సినిమా జనాలకి ఎక్కలేదు. అంతే మళ్ళీ పెద్ద సినిమా స్టార్ హీరోతో చేసే అవకాశాలు దక్కలేదు. అయితే మంచి పర్ఫార్మర్, అందంగా ఉంటుంది అని అందరూ చెప్పుకుంటారు. మరి ఇండస్ట్రీలో వారు ఎందుకు తనకి అవకాశాలివ్వడం లేదనేది ఇప్పటికీ చాలా మందికి అర్థం కాని ప్రశ్న. ఈ విషయంలో మాధవీ లత తన గొంతు కూడా వినిపించింది. నాకు ఎందుకు అవకాశాలివ్వడం లేదని పలు ఇంటర్వ్యూస్ లో వాపోయింది.

కానీ ఆమెని పట్టించుకున్న సినీ పెద్దలు లేరు. తన తర్వాత ఇండస్ట్రీకొచ్చి స్టార్స్ గా వెలుగుతున్న వారు.. మోస్ట్ వాంటెడ్ గా క్రేజ్ తెచ్చుకొని కోట్లలో రెమ్యునరేషన్ అందుకుంటున్న వారూ ఉన్నారు. ఏదైనా అంటే ఇక్కడ తెలుగమ్మాయిలను అంతగా ఎంకరేజ్ చేయరనేది వాదన. మాలో కూడా టాలెంట్ ఉంది. లేకపోతే నచ్చావులే ఎందుకు హిట్ అవుతుంది. అందరు నన్ను ఎందుకు అప్రిషియేట్ చేశారు. ఇక ఎక్స్‌ఫోజింగ్.. మాధవీ లత స్నేహితుడా సినిమాలో గ్లామర్ గా కనిపించలేదా.. దాన్ని ఎక్స్‌ఫోజింగ్ అనకుండా మరేమంటారు అని ప్రశ్నించిన సందర్భాలూ చాలా ఉన్నాయి.

అయినా తనకి సరైన సమాధానం దొరికింది లేదు. 2013 లో “అరవింద్ 2” చేసింది. ఇందులోనూ మాధవీ లతకి బాగానే మార్కులు పడ్డాయి. ఇక “చూడాలని చెప్పాలని” సినిమాలో నటించింది. ఇందులో హీరో నందమూరి తారకరత్న. ఇందులో తను మూగ, చెవుడు ఉన్న అమ్మాయిగా నటించి ఆకట్టుకుంది. కానీ అనుకున్న అవకాశాలు మాత్రం దక్కలేదు. విచిత్రం ఏమిటంటే గత రెండేళ్ళుగా కరోనా ఇండస్ట్రీని కొట్టిన దెబ్బకి ఓటీటీ ప్లాట్ ఫాంస్ కి బాగా డిమాండ్ పెరిగింది. సమంత, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఈషారెబ్బ లాంటి వాళ్ళు డిజిటల్ ఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. అక్కడ కూడా ఆమెని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు లేకపోవడం ఆశ్చర్యకరం.

































