ఉత్తరకొరియాలో ఆహార పదార్థాలకు తీవ్ర సంక్షోభం ఏర్పడింది. సరిహద్దుల్లో కరోనా ఆంక్షలు, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వరదలు పోటెత్తి పంటలకు నష్టం వాటిల్లడం కారణంగా ఆహార సంక్షోభం తలెత్తింది. ప్రస్తుతం అక్కడ ఒక బ్లాక్ టీ ప్యాకెట్ ధర రూ.5 వేలు, కాఫీ ప్యాకెట్ ధర రూ.7 వేలు, ఏడు అరటిపండ్ల (కిలో అరటిపండ్లు) ధర రూ.3 వేలకు పైనే పలుకుతున్నది.

ఉత్తరకొరియా రాజధాని ప్యాంగాంగ్‌లో పరిస్థితి మరింత దుర్బరంగా ఉన్నది. అక్కడ నిత్యావసర సరకుల ధరలకు రెక్కలు వచ్చాయి. ముఖ్యంగా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఊహించని విధంగా పెరిగిపోయాయి.































