మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది ఏపీ సర్కార్.. అగ్రవర్ణాలలో ఉండే పేదలకు రిజర్వేషన్లు కల్పించే విధంగా ఆలోచన చేస్తుంది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం. వీరికి విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చేవిధంగా నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం.

కాగా, ఇదివరకే 2019లో ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది.. ఈబీసీ రిజర్వేషన్ల ద్వారా కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, వెలమ తదితర అగ్రవర్ణ పేదలకు మేలు జరిగే అవకాశం ఉంది..





























