కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా (ఏఐ) దేశంలోని పలు నగరాల్లో తనకు గల ఇళ్ల ఫ్లాట్లు, ఆస్తులను విక్రయించాలని ప్రణాళిక రూపొందించింది. దీని ద్వారా రూ.250-300 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. అయితే.. ఈ ఆస్తులు అత్యంత విలాసవంతమైన ప్రాంతాల్లో ఉన్నాయి. దేశంలోని పది ప్రధాన నగరాల్లో ఎయిరిండియా ఆస్తులు ఉన్నాయి.

వివిధ నగరాల్లోని ఎయిరిండియా (ఏఐ) తన ఆస్తులను విక్రయించడానికి శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఈ ఆస్తుల విక్రయాలకు బిడ్లను ఆహ్వానించిందీ నోటీసు. ఎయిరిండియాకు వాణిజ్య, నివాస సముదాయాలు ఉన్నాయి. ఈ ఆస్తుల విక్రయానికి ఎంఎస్‌టీసీ అనే సంస్థను నియమించుకుంది. ఈ-వేలం ద్వారా ఈ ఆస్తుల విక్రయ ప్రక్రియ కొనసాగుతుంది.



























