దేశంలో కరోనా వ్యాక్సిన్ ఊపందుకుంది. 45 సంవత్సరాల పైబడిన వాళ్ళు అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో యూట్యూబ్ సెన్సేషన్ గంగవ్వ కూడా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంది. ఐతే ఇంజెక్ష్ వేస్తున్న సమయంలో నొప్పిని భరించలేకపోయారు గంగవ్వ. అందుకే ఆస్పత్రి సిబ్బంది ఇంజెక్షన్ ఇవగానే గట్టిగా అరిచారు గంగవ్వ. ఆ వీడియోను గంగవ్వ ఇన్స్టగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న సమయంలో భయపడుతూ చాలా హంగామా చేసింది గంగవ్వ.

ఇక వ్యాక్సిన్ తరువాత ఆమె జ్వరం, ఒళ్ళు నొప్పులో సతమతమవుతుందట. అయితే వ్యాక్సిన్ తరువాత ఈ లక్షణాలు సర్వసాధారణం కాబట్టి పెద్దగా భయపడాల్సిన పనిలేదని అంటున్నారు. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటోంది.



























