తాజగా యూపీ కాన్పూర్‌లోని ఐటీ శాఖ అధికారుల పరిశీలనలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. వారి లెక్కల ప్రకారం కాన్పూర్ నగరంలోని రోడ్ల పక్కన పండ్లు అమ్ముకునే వారు , పాన్‌షాపులు, చిన్న కిరాణాషాపు మరియూ రోడ్ల మీద తిరుగుతూ సమోసాలు, ఖారా పొట్లాలు వంటి చిరుతిళ్లు అమ్మేవారితూ పాటూ అక్కడ అడుక్కునే వాళ్ళు, చెత్త ఏరుకునే వారిలో 256 మంది కోటీశ్వరులున్నట్లు ఐటీ శాఖ అధికారులు గుర్తించారు.

ఇక ముఖ్యంగా చెత్త ఏరుకునే వారిలో కొందరికి మూడు కన్నా ఎక్కువగా కార్లు ఉన్నట్లు తేల్చారు. వీరంతా గత ఐదేళ్లుగా రూపాయి పన్ను కూడా కట్టడం లేదని గుర్తించారు. ఈ 256 మంది గత ఐదేళ్లలో రూ.375 కోట్ల ఆస్తులను కూడబెట్టినట్లు సంబంధిత శాఖ అధికారులు తేల్చారు.































