బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం ప్రేక్షకులను మరింత సందడి చేస్తోంది. ఇప్పటికే మొదటి వారం పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమంలో భాగంగా ముమైత్ ఖాన్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.

ఇక రెండవ వారం నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభించాడు బిగ్ బాస్. ఈ నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా తాము ఎవరినినైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వారి ఫోటోపై డ్యాగర్ గుచ్చి.. ఎందుకు నామినేట్ చేస్తున్నామనే దానిపై తగిన కారణాలు చెప్పాలి అంటూ బిగ్ బాస్ ఆదేశించాడు.
ఈ క్రమంలో బిగ్ బాస్ ఇంట్లో ఉండాలంటే ఒక అర్హత కావాలి శివ కి ఆ అర్హత లేదు అంటూ శివని నామినేట్ చేసాడు అఖిల్. ఇక మరో మరో కంటేస్టంట్ సరయూ కూడా శివ డబుల్ మీనింగ్ కామెంట్స్ చేస్తున్నాడంటూ నామినేట్ చేసింది. ఈ నేపధ్యంలో శివ మాట్లాడుతూ నేను ఏమి డబుల్ మీనింగ్ మాట్లాడాను అంటూ ప్రశ్నించగా.. నటరాజ్ మాస్టర్ కలుగజేసుకుని “నీ పిండి నేను పిసకలేను కానీ పిసికే వాడిని పిలుస్తా” అని అన్నావ్ అది డబుల్ మీనింగ్ డైలాగ్ కాదా అంటూ సరయు ని సపోర్ట్ చేసాడు.. దీనిపై శివ స్పందిస్తూ అసలు నేను ఆ డైలాగ్ అనలేదు.. ఒకవేళ ఆ మాటలు మాట్లాడాను అని నిరూపిస్తే ఎలిమినేషన్ కూడా లేకుండా తక్షణం నేను బయటకి వెళ్ళిపోతా అంటూ చాలెంజ్ చేసాడు.

గత వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ముందు యాంకర్ శివని అందరూ పులిహోర రాజాని చేశారు. నిజంగానే శివ అందరికీ పులిహోర కలిపేస్తున్నాడని గట్టిగానే చెప్పారు. ఈ నేపధ్యంలో ఈవారం యాంకర్ శివ హౌస్ లో ఎలా ఉంటాడు అనేది ఆసక్తికరంగా మారింది.































