ఆంద్రప్రదేశ్ హైకోర్టులో సీఎం జగన్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. రాష్ట్రంలోని పంచాయితీ కార్యాలయాలకు వైసీపీ రంగులను వేయడంపై హైకోర్టు సీరియస్ అయింది. వెంటనే వైసీపీ రంగులను తొలగించాలని ఆదేశించింది. పంచాయితీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఆ పిటీషన్ హైకోర్టు లో విచారణ జరిగింది. ఈ కార్యాలయాలు ప్రభుత్వానికి సంబందించినవి, వీటికి ఏ పార్టీకి సంబందించిన రంగులు ఉండరాదని ధర్మాసనం తేల్చి చెప్పింది.
అంతేకాదు ఈ రంగులు తొలగించే భాద్యతను తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది హైకోర్టు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 5 కి వాయిదా వేసింది. అయితే ఏపీ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చాలా ప్రభుత్వ కార్యాలయాలకు ఆ పార్టీ రంగులను వేస్తోంది. ఒక చోట జాతీయ జెండాను కూడా చేపివేసి అక్కడ వైసీపీ రంగులు వేయడం వివాదాస్పదమైంది. దీనిపై కలక్టర్ స్పందించి వెంటనే వాటిని తీయించారు.



























