సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. భార్యకు ఇష్టం లేకుండా జరిగే శృంగారాన్ని కూడా రేప్‌గానే పరిగణించాలని గతంలో తీర్పు చెప్పిన భారత అత్యున్నత న్యాయస్థానం నేడు మరో కీలక నిర్ణయాన్ని వెలవరించింది. మైనర్(18 ఏళ్లు నిండని) భార్యపై భర్త జరిపే లైంగిక చర్యను ముమ్మాటికీ నేరంగానే పరిగణించాలని, దానిని అత్యాచారంగానే భావించాలని చెప్పింది.
బాల్యవివాహాలపై నిషేధం కొనసాగుతున్నప్పటికీ తరచూ అలాంటివి చోటుచేసుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది. అరుదైన కేసులను ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన జస్టిస్ మదన్ బి. లోకుర్, దీపక్ గుప్తాల బెంచ్ బుధవారం తీర్పు చెబుతూ భారత శిక్షా స్మృతి(ఐపీసీ) సెక్షన్ 375పై ఈ మేరకు వివరణ ఇచ్చింది. గతంలో ఐపీసీ 375లో ఉన్న 2వ మినహాయింపును రద్దు చేసింది. ఈ తీర్పు ఇకపై మాత్రమే వర్తిస్తుందని గతంలో జరిగిన ఘటనలకు వర్తించదని పేర్కొంది.































