సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార, డైరెక్టర్ వంశి పైడిపల్లి కుమార్తె ఆధ్య, వీరిద్దరూ కలిసి “ఏ అండ్ ఎస్ ” అనే యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టిన విషయం మనకి తెలిసందే.. అయితే తొలుత త్రీ మార్కర్ ఛాలెంజ్ అనే వీడియో పోస్ట్ చేశారు వీరిద్దరూ… అనంతరం మరిన్ని విభిన్నమైన వీడియోలను పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్ తో పాటు ఆద్యంతం వినోదభరితంగా సాగే వీడియోలతో అభిమానులను బాగానే అలరిస్తున్నారు. అయితే మొన్న వీరిద్దరూ కలిసి రష్మిక మందన్న ను ఇంటర్వ్యూ చేస్తూ చేసిన అల్లరి అంత ఇంత కాదు.
తాజాగా సితార, ఆద్యలు ఇద్దరు కలిసి ” సరిలేరు నీకెవ్వరూ ” చిత్ర విజయంలో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ను ఇంటర్వ్యూ చేసారు. ఈ క్రమంలో సరిలేరు నీకెవ్వరూ చిత్ర విశేషాలను, షూటింగ్ సమయంలో జరిగిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మహేష్ బాబు సైతం తనదైన శైలిలో సమాధానాలు ఇవ్వడం మరింత ఆసక్తికరంగా సాగింది.
ఈ సంక్రాతి పండుగకు విడుదలైన సరిలేరు నీకెవ్వరూ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షలు కొల్లగొడుతుంది.



























