రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది భారతీయ రైల్వే. కరోనా నేపధ్యంలో ఇప్పటికే పలు రైళ్ళను తాత్కాలికంగా రద్దు చేసిన రైల్వే శాఖ. తాజాగా వాటిని పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. కరోనా ఉదృతి తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలో ఇప్పటికే భారీ సంఖ్యలో రైళ్ళు పట్టలేక్కాయి.. ఇక ఈ నెల 21 నుంచి మరిన్ని రైళ్ళను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు పేర్కొంది. ఈ నెల 25 నుంచి యూపీ గోరఖ్‌పూర్ నుంచి మహారాష్ట్రలోని బాంద్రా టెర్మినస్ వరకు కొత్తగా సమ్మర్ స్పెషల్ ట్రైన్‌ను ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది.

అయితే ఈ సోమవారం నుంచి మరో 50 ప్రత్యేక రైళ్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. జూన్ ఒకటో తేదీ నుంచి 18 మధ్య అదనంగా 660 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించేందుకు ఆమోదం తెలిపిన రైల్వే శాఖ గత శుక్రవారం నాటికి 983 ప్యాసింజర్, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది.



























