కొవిడ్ పరిస్థితులను సమీక్షించుకుంటూ భక్తులకు జారీ చేసే దర్శన టికెట్ల కోటాను పెంచుతామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు 5వేల మందికి ఆన్లైన్ ద్వారా టికెట్లను మంజూరు చేశామని, పరిస్థితులకు అనుగుణంగా మరో 5వేలు పెంచుతామని తెలిపారు.

సీఎం జగన్ ఆదేశాలను అనుసరించి ఎల్1, ఎల్2 దర్శనాలను రద్దు చేసి సామాన్య భక్తులకు త్వరగా స్వామి దర్శనం కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. దేశవ్యాప్తంగా ఆలయాల పునరుద్ధరణకు శ్రీవాణి ట్రస్టు ద్వారా నిధులు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.



























