అందవిహీనంగా ఉన్న తన గురువు కూతురుని చేసుకొని హీరోయిన్ ని ప్రేమని వద్దనుకున్న టాప్ హీరో

0
1227

గురువు మీద గౌరవంతో అందంగా లేకపోయినా ఆయన కూతుర్ని చేసుకున్న
అందాల నటుడు ఎవరో మీకు తెలుసా…?
ఈ పేరు వింటే అప్పటి తరం మహిళా ప్రేక్షకులకొక పులకరింత. కాలేజ్ అమ్మాయిలకైతే కలల రాకుమారుడు. ఆ రోజుల్లో ఆ హీరో కు ఉన్న ఫాలోయింగ్ మరే హీరోకు లేదు. అతనే శోభన్ బాబు ఎంతో మంది అమ్మాయిలకు శోభన్ బాబు నిద్రలేకుండా చేసేవారు. అసలు ఆ టైమ్ లో ఆయన క్రేజే వేరే. చెన్నైలోని ఆయన నివాస గృహానికి కట్టలు కట్టలుగా ప్రేమలేఖలు వచ్చిపడేవి. ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు కాబట్టి, ఆయన బతికి పోయారు కానీ, లేకపోతే ఆయన రోజుకో సిమ్ చొప్పున మార్చాల్సి వచ్చేది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆయన సినిమాలు ఆకట్టుకొనేవి . కాకపోతే మహిళా ప్రేక్షకుల క్రేజ్ అలాంటిలాంటిది కాదు. అలాంటి శోభన్ బాబు.. ఒక హీరోయిన్ కోసం పరితపించారు. కనీసం ఒక్క సినిమాలోనైనా ఆమె సరసన హీరోగా చేస్తే చాలని ఫీలవుతూ ఉండేవారు. ఆయన్ను అంతగా ప్రభావితం చేసిన ఆమె మరెవరో కాదు జయలలిత. ఆమె అందం, బ్రిలియన్సీ, చమత్కారాలకు శోభన్ బాబు క్లీన్ బౌల్డ్ అయిపోయారు. జయలలిత స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రోజుల్లో…. అప్పుడప్పుడే ఎదుగుతున్న శోభన్ బాబుతో కలిసి ఓసినిమా చేసేందుకు అప్పట్లో ఓ నిర్మాత ప్రయత్నించాడు. శోభన్ బాబును కలిసి ఓ నిర్మాత వెయ్యిరూపాయల అడ్వాన్స్ ఇచ్చి నా సినిమాలో నువ్వే హీరో, జయలలిత హీరోయిన్ అని చెప్పి శోభన్ బాబులో ఆశలు రేపాడు. అప్పటికి శోభన్ బాబు చిన్న హీరో కావడంతో ఆమె తల్లి సంధ్య ఈ సినిమా చేయడానికి నిరాకరించారట. ఆ తర్వాత ఆమెతో కలిసి నటించాలని దాదాపు 8 ఏళ్లు ఎదురు చూశాడని అంటుంటారు.

డాక్టర్ బాబు సినిమాతో జయలలిత పక్కన నటించాలనే శోభన్ బాబు కోరిక తీరింది. ఆ సినిమా తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్యా స్నేహం ప్రేమగా మారింది. ఒకానొక దశలో జయలలితను శోభన్ బాబు పెళ్లిచేసుకుంటారేమోననే పుకార్లు వినిపించేవి. కాని నిబద్దతకు నిజాయితికి నిలువుటద్దం శోభన్ బాబు. తనను తీర్చి దిద్దిన చెప్పిన గురువు గారు ఆర్థికంగా చితికి పోయి కుతురికి పెళ్లి చేయలేని స్తితిలో ఉండటం ఛూసి చలించిపోయారు. మరి ఆ గురువు గారి కూతురు జయలలిత ని పక్కన పేట్టేంత అందగత్తెనా అంటే అది కాదు కారు నలుపుతో లావుగా ఉండేవారు. ఈ మద్య ఒక ఇంటర్వ్యూలో రైటర్ ఆరుద్ర బార్య శోభన్ బాబు బార్య గురించి చాల ఘాటుగ స్పందించారు. శోభన్ బాబు గారికి బార్య విషయం లో అన్యాయం జరిగింది ఒకవేల పెళ్లి చేసుకొకపొతే ఖచ్చితంగా జయలలిత ని చేసుకునే వారు వాల్లిద్దరికి ఒకరంటే ఒకరికి చాల ఇష్టం అని చెప్పారు. అయితే ఆయన తన గురువుగారి కూతుర్ని పెళ్లిచేసుకొని ఉండడంతో, ఆమె అందంగా లేకపోయినా గురువుకిచ్చిన మాటకే కట్టుబడి , భార్యను చీట్ చేయకూదనే నియమంతో జయలలితను పెళ్లిచేసుకోకుండా, ఆవిడ్ని ఆరాధిస్తూ ఉండేవారని చెప్పుకుంటారు. శోభన్ బాబు అంటే జయలలితకి చెప్పలేనంత ఇష్టమట. శోభన్ బాబు తీసుకొన్న ఆ నిర్ణయానికి ఆమె కూడా ఎంతగానో ఆశ్చర్యపోయిందట. కేవలం గురువు మాటకి కట్టుబడి , ఆమె అందంగా లేకపోయినా చివరి వరుకూ ఆమెతోనే ప్రయాణం చేసిన శోభన్ బాబు ను మరింతగా ఆరాధించిందట జయలలిత. మొత్తం మీద భార్యను ఏ మాత్రం చీట్ చేయకుండా , జయలలితతో ఎఫైర్ కొనసాగించారని ఆ ప్రేమ జయలలిత బతికినంత కాలం నిలిచేఉందని అనుకుంటూ ఉంటారు.

ఏదేమైనా శోభన్ బాబు లాంటి అందగాడ్ని ప్రేమించి మరీ పడగొట్టిన హీరోయిన్ గా జయలలిత చరిత్రలో నిలిచిపోతే.. గురువుకిచ్చిన మాటకోసం జయలలితను పెళ్లిచేసుకోకుండా విలువలకే కట్టుబడ్డారు శోభన్ బాబు.