గతంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేసిన దేవినేని ఉమామహేశ్వరరావును ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖలు చేసారు. “ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నువ్వెంత దోచుకున్నది, ఇసుక మాఫియా ద్వారా ఎన్ని రూ. వేల కోట్లు పోగేసుకున్నది తొండలోనే బయట పడుతుంది కాస్త ఓపిక పట్టు ఉమా. మ్యాప్ మ్యాప్ లు ఆపేయ్. నువ్వెంత గొంతు చించు కున్న సింహంలా గర్జించలేవు. ప్రాణాలు తీసిన హంతకుడివి. నువ్వు నీతులు వల్లిస్తే ఎలా ?” అంటూ పరుష పదజాలంతో ఘాటు వ్యాఖలు చేసారు. ఈ మేరకు విజయ సాయి రెడ్డి తన ట్విట్టర్ లో ట్వీట్ చేసారు.
ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నువ్వెంత దోచుకున్నది, ఇసుక మాఫియా ద్వారా ఎన్ని వేల కోట్లు పోగేసుకున్నది తొందర్లోనే బయట పడుతుంది. కాస్త ఓపిక పట్టు ఉమా. మ్యావ్ మ్యావ్ లు ఆపేయ్. నువ్వెంత గొంతు చించుకున్నా సింహంలా గర్జించ లేవు. ప్రాణాలు తీసిన హంతకుడివి. నువు నీతులు వల్లిస్తే ఎలా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 25, 2020
శుక్రవారం వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేయనున్నట్టు మాజీ మంత్రి దేవినేని శుక్రవారం వ్యాఖానించారు. అసలు అవినీతి కేసుల్లో ఏ2 నిందితుడికి శాసన మండలిలో పనేంటని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా విజయ సాయి రెడ్డి ఈ వ్యాఖలు చేసారు.





























