ఏప్రిల్ నుంచి కొత్త GST విధానం అమలు – నిర్మలా సీతారామన్

0
374

రెండో సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్, మోడీ ప్రభుత్వంలో రెండో సారి ఈరోజు నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఆమె జీఎస్టీ గురించి మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు..

ఒకే దేశం, ఒకే పన్ను దేశంలో చాలా బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇచ్చిందని ఆర్ధిక మంత్రి నీర్మాల సీతారామన్ అన్నారు. GST వళ్ళ దేశ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడిందని, జీఎస్టీ ని ఇంకా సులభతరం చేయడానికి ప్రయత్నిస్తున్నామని, ఇందులో భాగంగా ఏప్రిల్ నుంచి కొత్త జీఎస్టీ విధానం అమలు చేయనున్నామని తెలిపారు నిర్మలా సీతారామన్. ఇన్ స్పెక్టర్ రాజ్ కు కాలం చెల్లిందని, అందులో భాగంగా పలు చెక్ పోస్టులు ఎత్తేసామని చెప్పారు ఆమె.

అంతేకాదు ప్రజలకు 10 శాతం వరకు పన్ను భారం తగ్గిందని ఆమె పేర్కొన్నారు. అలాగే రెండేళ్లలో కొత్తగా 16 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు పెరిగారని అన్నారు. సుమారు 40కోట్ల మంది జీఎస్టీ పన్ను రిటర్న్ ఫైల్ చేసారని, ఈ సంవత్సరం నుండి జీఎస్టీ మరింత సులభతరం కానుందని ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో ఆమె ప్రసంగంలో వివరించారు.